ఆ క్రికెటర్స్ కి బీసీసీఐ ఆసక్తికర శిక్ష

SMTV Desk 2019-04-20 15:33:39  BCCI, hardik pandya, KL Rahul

‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. అభాసుపాలైన టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ ఆసక్తికర శిక్ష వేసింది. కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున విధుల్లో అమరులైన పది మంది పారామిలటరీ కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక అంధుల క్రికెట్ సంఘానికి పది లక్షల రూపాయలు నిధులు సమీకరించాలని తెలిపింది. ఈ రెండింటికీ నాలుగు వారాల గడువు విధించిన అంబుడ్స్‌మన్… ఒక వేళ గడువులోగా నిధుల సమీకరణ పూర్తికాకపోతే మ్యాచ్ ఫీజులో నుంచి మినహాయింపు ఉంటుందని హెచ్చరించింది.