మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా... వస్తున్నా.. వస్తున్నా మీ తాట తీయనికి వస్తున్నా

SMTV Desk 2019-04-20 15:32:33  rgv, kcr,

సంచలనాత్మక డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. ఆయనకు నచ్చింది.. మెచ్చింది ఇష్టంగా చేయడంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గడు. ఆయనకు ఆయనే సాటి. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ జీవితంపై సినిమా చేసేందుకు రెడీ కాబోతున్నారు. టైగర్ కెసిఆర్ అని టైటిల్ పెట్టాడు. మరి ఇందులో విలన్లు ఎవరు.. అనే దానిపై ఆయన ట్విట్టర్ ద్వారా లీక్ లు వదులుతున్నాడు.

అదేమంటే.. తెలంగాణ వాళ్ళను ఏపి ప్రజలు థర్డ్ క్లాస్ సిటీజన్లుగా చూశారని పేర్కొంటున్నాడు. అంటే ఏపికి చెందిన నాయకులను విలన్లుగా చూపించబోతున్నారని దీని ద్వారా అర్థమౌతుంది. మరో విషయం ఏమంటే.. ఏపిలో ఏ నాయకులను విలన్లుగా చూపించబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తిగా మారింది.

అంతేకాకుండా ఆర్జీవీ ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. అందులో సాంగ్ పాడుతూ... భాష మీద నవ్వి.. ముఖాల మీద ఊసినవ్.. మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా... వస్తున్నా.. వస్తున్నా మీ తాట తీయనికి వస్తున్నా.. టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్ అంటూ పాడారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తెలంగాణ విభజన తర్వాత ప్రశాంతంగా కలసి మెలసి జీవిస్తున్న తెలంగాణ ఆంధ్ర వాళ్ళ మధ్య చిచ్చు పెడుతున్న ఆర్జీవీ అంటూ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.