చైతూ కెరీర్ లోనే మజిలీ అత్యధిక వసూళ్లు

SMTV Desk 2019-04-20 15:25:05  Majili, Chaitanya,

తొలివారం బాక్సాఫీస్ దగ్గర మజిలీ కుమ్మేసింది. రెండో వారం చిత్రలహరి సినిమా వచ్చినా.. మజిలీ జోరు ఆగలేదు. ఈ వారం జెర్సీ రాకతో మజిలీ జోరుకు బ్రేక్ పడినట్టేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, రెండు వారాల్లో మజిలీ ఏకంగా రూ. 36.14కోట్ల షేర్ ని రాబట్టిందని తెలుస్తోంది. బ్రేక్-ఈవెన్ దాటేసి లాభాల బాట పట్టింది.

ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే.. నైజాం – రూ. 12.31 కోట్లు , సీడెడ్ – రూ. 4.22 కోట్లు, ఉత్తరాంధ్ర – రూ 4.27 కోట్లు, ఈస్ట్ – రూ. 1.66 కోట్లు, వెస్ట్ – రూ. 1.40 కోట్లు, గుంటూరు – రూ. 1.96 కోట్లు, కృష్ణా – రూ. 1.81 కోట్లు, నెల్లూరు – రూ. 0.83 కోట్లు వసూలు చేసింది. చైతూ కెరీర్ లోనే మజిలీ అత్యధిక వసూళ్లు రాబట్టింది.