‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన నాని

SMTV Desk 2019-04-20 13:05:58  Gang Leader, Nani,

మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ని నాని వాడేసుకోవడంపై మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రానికి గ్యాంగ్ లీడర్ టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే, టైటిల్ వాడుకొనే అర్హత మెగా హీరోలకి మాత్రమే ఉందని మెగా అభిమానాలు ట్రోల్ చేస్తున్నారు.

దీనిపై జెర్సీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్న నాని స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి కి తాను వీరాభిమాని. ఆయన నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాని ఇప్పటికీ అభిమానిస్తా. ఐతే, ఆ సినిమాకు.. నా సినిమాకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. సినిమా విడుదలైన తర్వాత నా సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిలే సరైనదని ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు అనిపిస్తుందన్నారు నాని.