అందుకే బాబుకు ముఖం చాటేస్తున్నారా?

SMTV Desk 2019-04-20 13:04:59  Chandrababu

ఏపీ రాజ‌కీయాలు పూట‌కో మ‌లుపు తిరుగుతున్నాయి. ఎన్నిక‌లు పూర్త‌యినా ఫ‌లితాలు ఇంకా వెలువ‌డ‌టానికి స‌మ‌యం వుండ‌టంతో ర‌స‌వ‌త్త‌ర నాట‌కాల‌కు తెర‌లేస్తోంది. త‌న ఓట‌మి ఖాయ‌మ‌ని తేల‌డంతో ఈవీఎంల‌పై దేశవ్యాప్తంగా వ్య‌తిరేక‌త‌ను తీసుకురావ‌డం కోసం చంద్రబాబు నాయుడు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఇదిలా వుంటే బాబు ముఖ్య‌మంత్రి కావ‌డం ఈ ద‌ఫా క‌ల్లే అని సొంత పార్టీ నాయ‌కుల‌కు తెలిసిపోయిందా? అందుకే బాబుకు ముఖం చాటేస్తున్నారా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు నిజ‌మ‌నే సంకేతాల్ని అందిస్తున్నాయి.

ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడు కర్నూల్‌లో ప‌ర్య‌టించారు. అక్క‌డ‌ ఎన్నిక‌ల స‌ర‌ళిపై జిల్లా నేత‌ల‌తో స‌మీక్ష నిర్వ‌హించాల‌నుకున్నారు. ఇందుకు భూమా అఖిల ప్రియ‌, బుడ్డా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, తిక్కారెడ్డిల‌తో పాటు కొత్త‌గా పోటీ చేసిన కె.ఈ. ప్ర‌తాప్, టీజీ భ‌ర‌త్‌, కేఈ శ్యాంబాబు, మీనాక్షీ నాయుడు త‌దిత‌ర స్థానిక నాయ‌కుల‌కు క‌బురు పెట్టారు. బాబు స‌మీక్షా స‌మావేశానికి ఎంత సేపు ఎదురు చూసినా ఎవ‌రూ రాలేదు. దీంతో వున్న వారితోనే బాబు స‌మీక్ష నిర్వ‌హించి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి పిలిచినా సొంత పార్టీ నేత‌లు వెల్ల‌క ముఖం చాటేయ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారం లోకి రావ‌డం క‌ష్ట‌మ‌ని వారికి తెలియ‌డం వ‌ల్లే బాబును ఖాత‌రు చేయ‌లేద‌ని జిల్లా నేత‌లు చెబుతున్నారు