హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన సినిమా

SMTV Desk 2019-04-20 13:01:04  Allu arjun jersey,

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని-శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి.. హిట్.. మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. సినిమా చూసిన ప్రేక్షకులు, సినీ స్టార్స్ జెర్సీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సినీ స్టార్స్ తారక్, హరీష్ శంకర్, సుధీర్ బాబు, మంచు మనోజ్, మారుతి, ఇంద్రగంటి.. తదితరులు జెర్సీ సినిమాని ప్రశంసించారు. సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. తాజాగా, ఈ లిస్టులో బన్నీ కూడా చేరిపోయారు.

“ఇప్పుడే ‘జెర్సీ’ సినిమా చూశాను. హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన సినిమా. సినిమాలో ప్రతీ సీన్‌ను ఆస్వాదించాను. చిత్రయూనిట్‌కు అభినందనలు. నాని.. నువ్వు అద్భుతంగా నటించావు. ఇప్పటివరకు నువ్వు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్‌. అలాగే ఇదే ఇప్పటివరకు నీ ఉత్తమ ప్రదర్శన. ముఖ్యంగా డైరెక్టర్ గౌతమ్ గురించి చెప్పుకోవాలి. చాలా గొప్పగా సినిమా తీశాడు. స్టడీ అండ్ బోల్డ్. అందరూ కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది” ట్విట్ చేశారు బన్నీ.