భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు

SMTV Desk 2019-04-20 13:00:17  terrorists,

బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని భద్రతా బలగాలకు సమాచారం అందడంతో శుక్రవారం రాత్రి పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందాడు.ఈ సంఘటన జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో చోటు చేసుకుంది. ఉగ్రవాది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి.