బాబు నెలరోజులు కూడా ఆగలేరా ?

SMTV Desk 2019-04-20 12:46:00  Chandrababu,

ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి. కోడ్ అమల్లో ఉంది. అధికార ప్రతిపక్షాలు కొట్లాడాయి. ఇప్పుడు ఏపీలో ఉన్నది టీడీపీ ఆపద్ధర్మ ప్రభుత్వమే.. కోడ్ అమల్లో ఉండగా ఒక కేర్ టేకర్ లాగా మాత్రమే చంద్రబాబు వ్యవహరించాలి. కానీ ఇంకా ఆయన స్వతంత్ర సీఎంగానే వ్యవహరిస్తున్నారు. నిన్న సమీక్షలు నిర్వహించారు. అధికారులకు వివిధ పనులు పూర్తి చేయాలని ఆదేశించాడు. ఇది వివాదాస్పదమైంది..

ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎలా సమీక్షలు నిర్వహిస్తారని… కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. వెంటనే ఏపీ సీఎస్ కు నోటీసీలు జారీ చేసింది. ఏపీలో ఇలాంటి సమీక్షలు ఏంటని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బాబు తీరు ఇప్పుడు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

చంద్రబాబుకు అధికార యావ తగ్గడం లేదు. ఇంకా తను స్వతంత్ర ముఖ్యమంత్రిని అని కోడ్ వేళ కూడా దూసుకుపోతున్నారు. మొన్నటి ఎన్నికల వేళ అధికారుల బదిలీలను హైకోర్టుకు వెళ్లి అడ్డుకున్న బాబు అభాసుపాలయ్యారు. ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకుండా కేర్ టేకర్ లా ఉండాలంటే సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

ఓటర్లు తమ తీర్పునిచ్చారు. మే 23న బాబు ఉంటాడా? ఊడుతాడా అనేది తేలనుంది. ఈ నెల రోజులకు గమ్మున ఊరుకోకుండా ఏంటీ సమీక్షలని నెటిజన్లు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. బాబు నెలరోజులు కూడా ఆగలేరా అని సెటైర్లు పడుతున్నాయి.