‘మన్మధుడు 2’ నాగార్జున లుక్స్ అదుర్స్

SMTV Desk 2019-04-20 10:41:36  Manmadhudu 2, Nagarjuna,

టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో ‘మన్మధుడు 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2002లో విడుదలైన మన్మధుడు చిత్రానికి సీక్వెల్‌గా రాబోతుంది. చిలాసౌ చిత్రం ద్వారా దర్శకుడిగా మారిని నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాహుల్‌.. నాగార్జునకు సంబంధించిన లుక్స్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

‘దిస్‌ మ్యాన్‌.. ఫిట్‌నెస్‌ గోల్స్‌. కింగ్‌ ఫ్యాన్స్‌.. ఈ ఒక్క సీన్‌ మాత్రం మీకోసమే’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఫొటోలో నాగ్‌ కసరత్తులు చేస్తూ కనిపించారు. ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుంది. సమంత అతిథి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని నాగార్జున, పి.కిరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా కథ దాదాపుగా పోర్చుగల్‌ చుట్టూ తిరుగుతుంది. ఈ షెడ్యూల్‌తోనే పాటలతో పాటు టాకీ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. లక్ష్మి, వెన్నెల కిషోర్‌, రావు రమేష్‌, నాజర్‌, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.