ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా.... క్లాసెన్‌, డేల్‌స్టేయిన్‌ రాకతో పటిష్టంగా బెంగళూరు..

SMTV Desk 2019-04-20 10:34:08  RCB, Dale styen, klaseen

ఐపీఎల్‌లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా హోరా హోరి సమరం ఆరంభమైంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తగినంత విరామం దొరకడంతో గాయం నుంచి ఆండ్రీ రస్సెల్‌ కోలుకున్నాడని ప్రస్తుతం మ్యాచ్‌ ఆడేందుకు ఫిట్‌గానే ఉన్నట్లు కార్తీక్‌ చెప్పాడు. స్టార్‌ హిట్టర్‌ ఏబీ డివిలియర్స్‌ అనారోగ్యం కారణంగా నేటి మ్యాచ్‌లో ఆడటం లేదని బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ వివరించాడు. క్లాసెన్‌, డేల్‌స్టేయిన్‌ తుదిజట్టులోకి వచ్చినట్లు కోహ్లీ పేర్కొన్నాడు.

Teams:
Royal Challengers Bangalore (Playing XI): Parthiv Patel(w), Virat Kohli(c), Moeen Ali, Marcus Stoinis, Heinrich Klaasen, Akshdeep Nath, Pawan Negi, Dale Steyn, Mohammed Siraj, Navdeep Saini, Yuzvendra Chahal

Kolkata Knight Riders (Playing XI): Chris Lynn, Sunil Narine, Nitish Rana, Robin Uthappa, Dinesh Karthik(w/c), Andre Russell, Shubman Gill, Piyush Chawla, Kuldeep Yadav, Prasidh Krishna, Harry Gurney