జెర్సీ గురించి ఎన్టీఆర్ ఏమ్మన్నారంటే ?

SMTV Desk 2019-04-20 10:28:32  Jersey,

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన జెర్సీ మూవీపై ట్విట్టర్ వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జెర్సీ సూపర్ హిట్టని ఫ్యాన్స్ ట్విట్టర్ లో వ్యాఖ్యానిస్తుంటే.. సినీ మైదానంలో ఈ సినిమా సిక్సర్ కొట్టిందని మరికొందరు అంటున్నారు. అలాగే.. నాని తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని.. స్క్రీన్ ప్లే, బీజీఎం అద్భుతమనీ అంటున్నారు. కొన్ని రివ్యూ వెబ్ సైట్లు ఈ సినిమాకు 4 నుంచి 4.5 రేటింగ్ లు కూడా ఇచ్చేస్తున్నారు.

అదేవిధంగా సినిమాలో సెంటిమెంట్ సీన్లు బాగా పండాయని.. కేవలం రూ. 500 పెట్టి.. తన కుమారుడికి ఓ జెర్సీని కొనిచ్చేందుకు తండ్రిగా నాని పడ్డ తపన అద్భుతమని వెల్లడిస్తున్నారు. అసలు క్లైమాక్స్ అయితే అద్భుతంగా పండిందని తెలుపుతున్నారు. కొన్ని క్షణాల క్రితం యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ జెర్సీ సినిమా గురించి ట్విట్టర్ లో స్పందించారు. జెర్సీ ఔట్ స్టాండింగ్ మూవీ అని.. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి చక్కని అంశాన్ని తీసుకొని చాలా తెలివైన రూపాన్ని ఆవిష్కరించారని తెలిపారు. గౌతమ్ విజన్ కు సినిమాలోని నటీటులు.. సాంకేతిక నిపుణులు అద్భుతమైన సాయం అందించారని తెలిపారు. నాని బాల్ సిక్స్ కొట్టిందని... అద్భుతమైన ప్రదర్శన చూసి గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు జూనియర్ ఎన్టీఆర్. అలాగే.. సినిమాకు పని చేసిన అందరినీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.