డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంటె పోర్న్ చూడొచ్చు ..

SMTV Desk 2019-04-19 18:32:00  porn videos,

యూత్ పోర్న్ వీడియోలు చూడడం లో సిద్దహస్తులు .. అవి చూడాలంటే తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలని నిబంధనలు ఉన్నాయి. కానీ చాలామంది వయసు నిండకుండానే 18+ బటన్ నొక్కె ఆ వీడియోలు చూస్తున్నారు. కానీ ఇక నుంచి అలా చేసేందుకు వీలు లేదు. ఆ వీడియోలు చూడాలంటే తప్పని సరిగా 18 ఏళ్లు నిండి ఉన్నట్లు నిరూపిస్తేనే వారికి ఆ వీడియోలు చూసేందుకు ఆస్కారం ఉంది. ఈ నిబంధన జులై 15వ తేదీ నుంచి యూకేలో అమలు కానుంది.

వివరాల్లోకి వెళితే యూజర్లు పోర్న్ వీడియోలు చూడాలంటే.. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేదా ఓటర్ ఐడీ కార్డుల‌లోని వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు యూకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనుమతి పొందిన ప్రతీ పోర్న్ వెబ్‌సైట్లు డేట్ ఆఫ్ బర్త్ , ఇతరాత్ర ఆధారాలు నిర్ధారించుకున్న తర్వాతే వైబ్ సైట్లలోకి ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని, లేకపోతే ఆ వెబ్ సైట్లు మొత్తం బ్యాన్ చేస్తామని ప్రభుత్వ స్పష్టం చేసింది.

ఇండియాలో పోర్న్ బ్యాన్ అయ్యింది కాబట్టి దీని అవసరం లేకపోవచ్చు కానీ.. యూకేలో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ప్రతి ఒక్కరు పోర్న్ వీడియోలు చూసేయొచ్చు. దీని వల్ల చిన్న పిల్లలు కూడా పోర్న్ వీడియోలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోకుడదనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.