రెండో విడత రాష్ట్రాల వారి పోలింగ్ వివరాలు

SMTV Desk 2019-04-19 12:10:32  loksabha elections, second phage of loksabha elections polling

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల సందర్భంగా గురువారం ఉదయం ప్రారంభమయిన రెండో విడత పోలింగ్ ముగిసింది. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరిగింది. తమిళనాడు, యూపీలోని మథురలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో సాయంత్రం 5గంటలకే పోలింగ్ ముగిసింది. మథురలో రాత్రి 8గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ముగిసే సమయానికి పోలింగ్‌ శాతం 61.12గా నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 75.27% పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా జమ్ముకశ్మీర్‌లో 43.37% పోలింగ్‌ నమోదైంది.

రాష్ట్రాల వారి పోలింగ్ వివరాలు:

అసోం - 73.32%
బిహార్‌ - 58.14%
ఛత్తీస్‌గఢ్‌ - 68.70%
జమ్ముకశ్మీర్‌ - 43.37%
కర్ణాటక - 61.80%
మహారాష్ట్ర - 55.37%
మణిపూర్‌ - 74.69%
ఒడిశా - 57.41%
పుదుచ్చేరి - 72.40%
తమిళనాడు - 61.52%
ఉత్తర్‌ప్రదేశ్‌ - 58.12%
పశ్చిమ బెంగాల్‌ - 75.27%