ఓటు హక్కుపై అవగాహన...30% డిస్కౌంట్ తో రంగంలోకి ప్రైవేటు కంపెనీస్

SMTV Desk 2019-04-19 12:06:06  hero, subway, McDonald s, vote, elections

ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ప్రైవేటు రంగ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో బంపర్ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. హీరో మోటొకార్ప్, సబ్‌వే, ఫ్యూచర్ రిటైల్, వెస్ట్‌లైఫ్ కార్పొరేషన్ వంటి కంపెనీలు దాదాపు 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నాయి. దీనికి కోసం కస్టమర్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు చేతి వెలికి వేసిన సిరా గుర్తను చూపిస్తే చాలు. ప్రపంచపు అతిపెద్ద టూవీరల్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్.. టూవీలర్ వాష్ అండ్ సర్వీసింగ్‌ సేవలను రూ.199కే అందిస్తోందని ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది. ఈ సేవలకు సాధారణంగా రూ.500 నుంచి రూ.600 వరకు అవుతుంది. ఏప్రిల్, మే నెలలో పోలింగ్ రోజు తర్వాత రెండు రోజులు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. క్విక్ సర్వీస్ రెస్టారెంట్ సబ్‌వే కూడా ఫుడ్ ఐటమ్స్‌పై 18 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీనికి కూడా సిరా మార్క్ తప్పనిసరి. ‘దేశంలో కార్యకలాపాలు ప్రారంభించి 18 ఏళ్లు కావొస్తున్నాయి. యువతతోపాటే మేము ఎదిగాం. యువతను ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రోత్సహించేందుకు డిస్కౌంట్ అందిస్తున్నాం’ అని సబ్‌వే దక్షిణాసియా డైరెక్టర్ రంజిత్ తల్వార్ తెలిపారు.మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన వెస్ట్‌లైఫ్ డెవలప్‌మెంట్ కూడా రూ.50 డిస్కౌంట్ అందిస్తోంది. తమిళనాడు, కర్నాటక, గుజరాత్, కేరళ, పుణే, ముంబై వంటి పలు నగరాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.