సీఎంను 'ఆడు' అంటావా....వర్మకు వార్నింగ్

SMTV Desk 2019-04-19 12:05:13  cm kcr, ktr, ram gopal varma, cm kcr biopic tiger

హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొట్ట మొదటి సారి అతను చేసిన ఓ పనికి పూర్తిగా వివరణ తెలిపారు. ఎప్పుడూ చాకచక్యంగా స్పందించే వర్మ మొదటి సారి శాంతంగా మాట్లాడారు. అసలు విషయానికొస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయం జీవితం ఆధారంగా ‘టైగర్ కేసీఆర్’ పేరుతో బయోపిక్ తీస్తున్నానంటూ ఆయన ఈ రోజు విడుదల చేసిన టైటిల్ ఆసక్తికరంగా మారింది. అయితే ట్యాగ్ లైన్‌లో అగ్రెసివ్ గాంధీ అని రాసి, దానికింద ‘’ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అని ఉపశీర్షిక పెట్టడంపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ఒక సీఎంను పట్టుకుని ఆడుగీడు అంటవేంది అని కేసీఆర్ అభిమానులు వర్మను ఆడుకుంటున్నారు. అయితే దీనిపై స్పందించిన వర్మ వివరణ ఇచ్చి వారిని శాంతపరిచారు. కేసీఆర్ తెలంగా తేలేడని చులకభావంతో అన్నవాళ్ల దృష్టికోణంతో ‘ఆడు.. ’ అని పెట్టామని, అందులో దురుద్దేశమేదీ లేదని ట్విటర్లో వివరణ ఇచ్చారు. తన ట్యాగ్ లైన్ లోని భావాన్ని కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. అంతకు ముందు మరో ట్వీట్ చేస్తూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. కేటీఆర్, వైఎస్సార్ తమ కొడుకులను చక్కగా పెంచి ప్రయోజలకలను చేశారని, తెలంగాణ పొరుగు రాష్ట్రంలోని నాయకులు అలా చేయదని పరోక్షంగా చంద్రబాబును, ఆయన కొడుకు లోకేశ్ ను ఉద్దేశించి అన్నారు.