మహిళలకు వర్క్ ప్లేస్ లో తప్పని వేధింపులు!!!

SMTV Desk 2017-08-18 13:49:08  delhi, women harrasment, sexual abuse, nirbhaya

న్యూఢిల్లీ, ఆగస్ట్ 18: ఫైవ్ స్టార్ హోటల్ లో లేడీ సిబ్బందిని ఓ అధికారి లైంగికంగా వేధించిన ఘటన తాలూకా దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో తాను పని చేస్తునడగా అదే హోటల్ లో పవన్ అనే వ్యక్తి సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. చాలా రోజుల నుండి పవన్ తనను వేధిస్తున్నట్టు ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయిందని ఆమె వాపోయింది. అయితే, 17 రోజుల క్రితం పవన్ ఆమె చీర పట్టుకొని లాగిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, ఘటన జరిగి 17 రోజులైనప్పటికి అధికారులు ఇంకా అతని పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ...పవన్ మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళలకు వర్క్ ప్లేస్ లో వేధింపులు లేకుండా చాల చట్టాలే చేసారు. అయినప్పటికి ఇలాంటివి ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయని మహిళలు ఆరోపిస్తున్నారు. కటినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటివి ఆగవు అని మహిళా లోకం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.