జెర్సీ vs కాంచన 3

SMTV Desk 2019-04-19 12:00:34  jersey, kanchana 3, nani, raghava Lawrence

హైదరాబాద్: గత కొద్ది రోజుల నుండి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల ఫైట్స్ పెద్దగా లేవు. అన్ని చిన్న చిన్న సినిమాల వల్ల అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు. మొన్న వచ్చిన మజిలి, ఎఫ్ 2 తప్ప అన్ని నిరాశే మిగిల్చాయి. కాని సమ్మర్ లో ఈ ఏడాది ఫస్ట్ టైమ్ రెండు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. నాని క్రికెటర్ గా కనిపించిన జెర్సీ.. అలాగే రాఘవ లారెన్స్ హారర్ కామెడీ థ్రిల్లర్ కాంచన 3 సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. గతంలో వచ్చిన లారెన్స్ కాంచన సిరీస్ లు మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నాయి. ఇప్పుడు కూడా కాంచన 3 సినిమా భారీగా రిలీజ్ అవుతోంది. ఇక నాని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఎమోషనల్ స్టోరీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. హాలిడేస్ కావడంతో డిఫరెంట్ సినిమాల కోసం జనాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.