నష్టాల బాట పడుతున్న స్టాక్ మర్కెట్స్

SMTV Desk 2019-04-18 18:11:54  Sensex, Nifty, Stock market, Share markets

నాలుగు రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను ఒదిలేసి నష్టాల బాట పట్టాయి. గురువారం కూడా స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. చివరకు సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 39,140 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 11,753 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఎల్అండ్‌టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్ వంటి హెవీవెయిట్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది.