ఎన్నికలు అయినాక పవన్ మౌనం .. ఎందుకంటే ?

SMTV Desk 2019-04-18 17:11:21  Pawan Kalyan, Jansena

ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన సార్వత్రిక ఎన్నికల తర్వాత అక్కడ పోటీ చేసిన మూడు ప్రధాన పార్టీలలో వైసీపీ అధినేత జగన్ మరియు టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబులు తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తూనే మరో పక్క అక్కడికి ఇక్కడికి తిరుగుతూ హంగామా చేసేస్తున్నారు.కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వీరికి భిన్నంగా తన శైలిని ప్రదర్శిస్తున్నారు.వీరిద్దరిలా ఏమాత్రం హడావుడి చెయ్యకుండా సైలెంట్ గా తన పని ఏదో తాను చూసుకుంటున్నారు.

దీనితో చాలా మంది పవన్ ఓడిపోతాడని అతనికి అర్ధమయ్యిపోయింది అందుకే సైలెంట్ అయ్యిపోయాడని అప్పుడే విమర్శలు మొదలు పెట్టేసారు.కానీ అలా పవన్ మౌనంగా ఉండటం వెనుక వేరే ఆంతర్యం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.పవన్ తన బాధ్యతగా ఎన్నికల ముందు వరకు ప్రచారం చేసుకున్నారు.ఓటు వేసుకున్నారు.ఇక ఆ తర్వాత రాబోయే ఫలితాలను తానే ఊహించేసుకుంటే ఇక ఎన్నికలు ఎందుకు?అది ప్రజలు ఇచ్చే తీర్పు కనుక పవన్ అలా మౌనంగా ఉన్నారని అంటున్నారు.ఈ సమయంలో ఇతర నేతల్లా కాకుండా పవన్ వ్యవహరించిన తీరే సరైనది అని విశ్లేషకులు అంటున్నారు.