పాకిస్తాన్ రిపోర్టర్ కష్టాలు...వీడియో వైరల్

SMTV Desk 2019-04-18 17:07:11  Taking news reporting to new heights, pakistan news reporter

ఇస్లామాబాద్: న్యూస్ లైవ్ కోసం ఓ రిపోర్టర్ పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. ఏకంగా పీకల్లోతు నీళ్లు పారుతున్న నదిలో దిగి రిపోర్టింగ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల ప్రకారం...పాక్‌లో వర్షాలు కురుస్తూ.. నదులు పొంగి పొర్లుతున్నాయట. దీంతో వరద తీవ్రత గురించి చెప్పడానికి రిపోర్టర్ నది ప్రవాహంలోకి దిగాడు.. నది మధ్యలో నిలబడి రిపోర్టింగ్‌ చేశాడు. ఓ నెటిజన్ తన ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. వీడియో పోస్ట్ చేసిన నెటిజన్ ప్రొడ్యూసర్ వేరే ఏ ఛానల్ చేయని కొత్త స్టోరీని తీసుకురమ్మని చెప్పినట్లున్నాడు.. అంటూ రిపోర్ట‌ర్‌పై పంచ్ పేల్చారు. ఇక నెటిజన్లు అయితే ఈ వీడియోను తెగ ట్రోల్ చేస్తున్నారు. జాగ్రత్త బాబూ.. వరదలో కొట్టుకుపోతావ్ అంటూ సెటైర్లే వేస్తే.. కొందరు మాత్రం రిపోర్టర్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.