జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల షెడ్యూల్

SMTV Desk 2019-04-18 16:31:31  telangana mptc elections, telangana zptc elections, election commission

హైదరాబాద్‌: జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 535 జడ్పిటిసి, 5817 ఎంపిటిసి స్థానాలకు మూడు దశల్లో (మే 6, 10, 14వ) పోలింగ్‌ జరగనున్నాయి. ఈ క్రమంలో వచ్చే రెండు రోజుల్లో అధికారికంగా నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఏప్రిల్ 22వ తేదీన మొదటి విడుత నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మే 6వ తేదీన మొదటి విడుత ఎన్నికలు జరగనున్నాయి. అందులో 212 జడ్పిటిసి, 2365 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన రెండో విడుత నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 26న విడుదల కానుంది. రెండో విడతలో 199 జడ్పిటిసి, 2109 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 30న మూడో విడుత నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మూడో విడుతలో భాగంగా 124 జడ్పిటిసిలు, 1343 ఎంపిటిసి స్థానాలకు మే 14న పోలింగ్‌ జరగనుంది.
మెదటి దశలో ఎన్నికలు జరిగే జిల్లా: మేడ్చల్ (మల్కాజిగిరి)
రెండు దశలో జరిగే జిల్లాలు: జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ అర్బన్.
మూడు దశలో జరిగే జిల్లాలు: ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, ములుగు.