లారెన్స్ చారిటబుల్ ట్రస్టు కు మెగాస్టార్ విరాళం

SMTV Desk 2019-04-18 16:13:11  Lawrence, Megastar Chiranjeevi

గ్రూప్ డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు రాఘవ లారెన్స్. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం కాంచన 3. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్బంగా లారెన్స్‌ను ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఇందులో లారెన్స్ గురించి మెగాస్టార్ చాలా గొప్పగా చెప్పారు. అంతేకాదు.. లారెన్స్ స్వచ్ఛంద సహాయంలో ముందున్నాడు. తన లారెన్స్ చారిటబుల్ ట్రస్టు బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ టస్టుకి తన వంతుగా రూ. 10లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపారు.

ఇదిలావుండగా లారెన్స్ తాజా చిత్రం కాంచన 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ లో వచ్చిన కాంచన, కాంచన2 సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కాంచన 3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.