మన్మథుడు 2 సెట్స్ నుండి క్రేజీ పిక్ షేర్ చేసిన రకుల్

SMTV Desk 2019-04-18 16:08:12  Manmadhudu , rakul preet, rahul ravindran

కింగ్ నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన మన్మథుడు సినిమాకు సీక్వల్ గా మన్మథుడు 2 సెట్స్ మీదకు వెళ్లింది. చిలసౌ సినిమాతో సత్తా చాటిన రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా నుండి ఓ క్రేజీ పిక్ షేర్ చేసింది రకుల్.

లొకేషన్ నుండి ఓ ఫోటోని తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది రకుల్. అందులో బెడ్ మీద ఉన్న రకుల్ నుండి కెమెరా మెన్, డైరక్టర్ టేక్ తీసుకుంటున్నారు. ఇక ఈ పిక్ షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ కూడా పెట్టింది రకుల్. డైరక్టర్ సీట్ లో పెద్దన్న రాహుల్ రవింద్రన్ ఉన్నప్పుడు అంతకంటే బెటర్ విషయం ఏముంటుంది.. మన్మథుడు 2 లో ప్రతి సీన్ చాలా అందంగా ఉంది.. లవ్ ఇట్ అంటూ రకుల్ దర్శకుడు రాహుల్ రవింద్రన్ తో పాటుగా సినిమాపై కూడా అంచనాలు పెంచుతుంది రకుల్.