నిద్రమాత్రలు సిగరెట్ లతో సమానమా?

SMTV Desk 2017-06-02 17:40:59  Arizona university, Britan,Cancer,Heart attack

వాషింగ్టన్, జూన్ 2 : నిద్ర మాత్రలు శరీరానికి అత్యంత హాని కల్గిస్తాయని అంటున్నారు నిపుణులు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. బ్రిటన్ లో మాత్రం పదిమందిలో ఒకరికి మాత్ర పదనిదే కళ్ళు మూతపడవు. ఈ సమస్యపై అరిజోనా విశ్వవిద్యాలయం పరిశోధకుడు దృష్టి సారించి నిద్రమాత్రాలను నిత్యం వాడుతున్నవారిని పరిశీలించి వాటి కారణంగా వచ్చే వ్యాధులను గుర్తించారు. ఈ ఔషదాలను వాడడం వల్ల గుండెపోటు, క్యాన్సర్ , స్థిమితం కోల్పోవడం, స్పృహ తప్పడం, మతిమరుపు , ఎముకలు గుల్లబారడం వంటి సమస్యలు ఏర్పడుతాయని తేల్చారు. ఇలాంటి సమస్యలు తరుచుగా సిగరేట్ తాగే వారిలో కూడా కనిపిస్తాయని పరిశోధకుడు షాన్ వివరించాడు. శారీరక శ్రమ ఉండకపోతే చాలా మందికి నిద్రలేమి ఉంటుందని , నడక వంటి సులువైన వ్యాయామాలను ప్రతిరోజూ చేయడం వల్ల కునుకు సహజంగానే వస్తుందని, వ్యాయామ సమయం వారానికి కనీసం 150 నిముషాలు అవసరమని షాన్ వివరించారు.