జెట్ ఎయిర్‌వేస్ ఖేల్ ఖతం . 16 వేల మందికి ఇంటికి..

SMTV Desk 2019-04-18 11:30:06  Jet airways,

దేశంలో ఒక ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ శకం ఇక ముగిసినట్లే. అప్పుల కుప్పలు, నిర్వహణ లోపాలతో విలవిల్లాడుతున్న జెట్ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. అత్యవసర నిధుల ప్రతిపాదన కూడా వీగిపోవడంతో సర్వీసులకు తెరపడింది. కార్యకలాపాలు నిలిచిపోకుండా అత్యవసరంగా రూ. 400 కోట్లు ఇవ్వాలన్న సంస్థ వినతిని రుణదాతలు తోసిపుచ్చారు.

దీంతో విమానాలను పూర్తిగా నిలిపివేశారు.నిన్న రాత్రి 10:30కు అమృత్‌సర్‌ నుంచి ముంబై వెళ్లే విమానమే ఆఖరి సర్వీస్ అయింది. రుణభారతంతో జెట్‌ ఇప్పటికే చాలా విమానాలు నిలిపివేసింది. ఒకప్పుడు 123 విమానాలు నడిపిన సంస్థ చివరికి ఇంధనానికి కూడా చేతులు చాస్తోంది. సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతోంది. జెట్ ఎయిర్‌వేస్ ను ఆదుకోవడం తమ వల్ల కాదని ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం చెప్పేసింది. జెట్ ఎయిర్‌వేస్‌కు రూ. 3500 కోట్ల అప్పులు ఉన్నాయి. టికెట్ల రద్దు, ఇతక ఖర్చుల కింద రూ.3500 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో మొత్తం బకాయిలు రూ. 8500 కోట్ల చేరాయి. జెట్ సర్వీసులు రద్దు కావడంతో అందులో పనిచేస్తున్న 16 వేల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.