SRH vs CSK: బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

SMTV Desk 2019-04-18 11:24:11  srh vs csk, ipl 2019

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. వెన్నునొప్పి కారణంగా మహేంద్రసింగ్ ధోనీ ఈ మ్యాచ్‌కి దూరమవడంతో తాత్కాలిక కెప్టెన్ గా సురేష్ రైనా భాధ్యతలు చేపట్టారు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఏడు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొంది ఆరో స్థానంలో ఉంది. ముఖ్యంగా.. చెన్నై జట్టు చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి ఊపుమీదుంటే.. హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడిపోయింది. అయితే.. ఉప్పల్‌లో ఈరోజు మ్యాచ్ జరుగుతుండటం హైదరాబాద్‌కి లాభించే అంశం. సీజన్ ఆరంభం నుంచి ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోపై అతిగా ఆధారపడుతున్న హైదరాబాద్ జట్టు.. చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు చేతులెత్తేయడంతో ఓడిపోయింది. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ.. ఫర్వాలేదనిపిస్తున్నా మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే ప్రదర్శన మాత్రం చేయలేకపోతున్నారు. చెన్నై జట్టులో ఓపెనర్ల బలహీనత ఉన్నా.. మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, జడేజాలు మ్యాచ్‌లను గెలిపిస్తున్నారు. బౌలింగ్‌లో దీపక్ చాహర్ అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందిపెడుతుండగా.. ఇమ్రాన్ తాహిర్ యువ స్పిన్నర్లకి పోటీనిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు.

Chennai Super Kings (Playing XI): Shane Watson, Faf du Plessis, Suresh Raina(c), Sam Billings(w), Ambati Rayudu, Kedar Jadhav, Ravindra Jadeja, Karn Sharma, Deepak Chahar, Shardul Thakur, Imran Tahir .

Sunrisers Hyderabad (Playing XI): David Warner, Jonny Bairstow(w), Kane Williamson(c), Vijay Shankar, Yusuf Pathan, Deepak Hooda, Rashid Khan, Shahbaz Nadeem, Bhuvneshwar Kumar, Sandeep Sharma, K Khaleel Ahmed .