రేపు సాయంత్రం ఇంటర్ రిజల్ట్స్

SMTV Desk 2019-04-17 19:22:04  telangana board of intermediate education, inter results

హైదరాబాద్: రేపు సాయంత్రం తెలంగాణ బోర్డు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి విడుదల చేయనున్నారు. నాంపల్లిలో తెలంగాణ స్టేట్‌ బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియేట్‌ ఎడ్యుకేషన్‌ విద్యాభవన్‌లో అధికారులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు గత వారమే విడుదలయ్యాయి. తెలంగాణలో మాత్రం ఆలస్యం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యామండలి ఇంటర్ ఫలితాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. దీంతో వేంటనే తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి స్పందించి ఏప్రిల్ 18న ఫలితాలు విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించాడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.