అజార్‌పై చైనా స్పష్టమైన వైఖరితో ఉంది!!!

SMTV Desk 2019-04-17 19:19:00  masood azhar, jaish e mohammed, germeny, united nation organisation, international terrorist, usa

బీజింగ్: మసూద్ అజార్ ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించేందుకు చైనా అడ్డుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే చైనా తన తీరును మార్చుకునేందుకు ఏప్రిల్ 23న డెడ్‌లైన్ విధిస్తూ అమెరికా ఫ్రాన్స్ యూకే దేశాలు అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై చైనా విదేశాంగ ప్రతినిధి లూకాంగ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని అన్నారు. ఐక్యారాజ్య సమితి భద్రతా మండలి, 1267 ఆంక్షల కమిటీలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు.వస్తున్న వార్తలపై స్పష్టమైన ఆధారాలు ఉండాలని చెప్పిన లూకాంగ్... మసూద్ అజార్‌పై చైనా స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పారు. ఈ సమస్య కేవలం చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని అన్నారు. శాశ్వత సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం రానిదే సమస్యకు పరిష్కారం జరగదని చెప్పారు. అంతవరకు ఎలాంటి వార్తలను నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. ఇక మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చడంపై చైనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. అంతేకాదు ఈ అంశంపై పలుదేశాలతో చర్చిస్తున్నామని కూడా చైనా పేర్కొంది. పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని లూకాంగ్ తెలిపారు. కొన్ని దేశాలు అజార్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ ఐక్యారాజ్య సమితి భద్రతామండలి పై ఒత్తిడి తీసుకొస్తున్నాయని చెప్పిన లూకాంగ్.. ఆ చర్యను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.