నగ్నంగా ఉంటేనే నటన!!!

SMTV Desk 2019-04-17 18:37:53  himayat nagar acting school, acting nude

హైదరాబాద్/హిమాయత్ నగర్: నటన నేర్చుకోవాలంటే నగ్నంగా ఉండాలని ఓ గురువు తన తగ్గరికి నటన కోసం వచ్చిన విద్యార్థులకు భోధిస్తున్నాడు. ఈ సంఘటన హిమాయత్ నగర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం.... హిమాయత్ నగర్‌లోని సూత్రధార్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌ నడుపుతున్న వినయ్ వర్మ అక్కడి వచ్చిన యువతుల పట్ట అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అచింత కౌర్ చద్దా అనే యువతి పిర్యాదు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.చద్దా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసింది.. ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌కు వినయ్ వర్మ డైరెక్టర్. నేను ఈ మధ్యే యాక్టింగ్ నేర్చుకునేందుకు అక్కడ చేరాను. నాతో పాటు మరో ఎనిమిది మంది కూడా చేరారు. ప్రతీ రోజు ఉదయం 6:30 నుంచి ఉదయం 9:30 వరకు శిక్షణ తరగతులుంటాయి. నిన్న వినయ్ వర్మ ఆధ్వర్యంలో యాక్టింగ్ తరగతులు నిర్వహించారు. ఆ సమయంలో రూమ్ తలుపులు, కిటికీలు అన్ని మూయమని చెప్పాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరినీ బట్టలు విప్పమని చెప్పారు. నాకు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను బట్టలు తీయనని మా సర్‌కు చెప్పాను. ఆయన నన్ను తిట్టి బయటికి వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ నాతో పాటు ఉన్న ఓ యువతి మాత్ర సార్ చెప్పినట్లే బట్టలు మొత్తం విప్పేసింది. మిగతా యువకులంతా అలాగే చేశారు’ అని చెప్పింది. దీనిపై వెంటనే షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశానని, కానీ వారు పట్టించుకోలేదు. దాంతో పోలీసుల్ని ఆశ్రయించాను.. ’ అని తెలిపింది. అయితే దీనిపై వినయ్‌ స్పందిస్తూ.. ‘ బట్టలు విప్పమనడంలో తప్పులేదు. అలా నేర్పిస్తేనే వాళ్లు ఈ రంగంలో బాగా రాణిస్తారు. వారి మైండ్‌లో ఎలాంటి ఫీలింగ్ లేకుండా చేసేందుకే ఇలా బట్టలు విప్పించి, నటన నేర్పిస్తాను. మా పిల్లలతో కూడా ఇలాగే చేయిస్తాను. ఇప్పటికే చాలామందికి ఇలాగే బట్టలు విప్పించి నటన నేర్పాను. అచింత కౌర్ చద్దా అనే అమ్మాయి బట్టలు విప్పడం ఇష్టంలేదని చెప్పగానే బయటకు పంపించేశాను’ అని పేర్కొన్నాడు.