హైదరాబాద్‌లో జోయలుక్కాస్‌ షోరూంను ఆరంభించిన కాజోల్

SMTV Desk 2019-04-17 18:36:53  kajol joyalukkas store launches in hyderabad, kajol

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి కాజోల్ హైదరాబాద్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జోయలుక్కాస్‌ ఆభరణాల షోరూంను తాజాగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కాప్రా సర్కిల్‌ ఏ ఎస్‌ రావునగర్‌లో ఉన్న షోరూమ్ కి కాజోల్‌ను చూడటానికి ఆమె అభిమానులు ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో చేరుకుని కాజోల్‌ను చూసి ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా కాజోల్‌ మాట్లాడుతూ..జోయలుక్కాస్‌ షోరూంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అభిమానులను, ఆభరణాల ప్రేమికుల్ని కలుసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. 2020 నాటికి 200 షోరూంలే లక్ష్యంగా పనిచేస్తున్నామని జోయలుక్కాస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండి జో§్‌ు అలుక్కాస్‌ తెలిపారు.