కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2017-08-17 19:21:07  Hyderabad,high court,Kakinada, Muncipal elections,

హైదరాబాద్, ఆగస్ట్ 17: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియకు ఈ నెల మొదట్లో శంఖం పూరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న 48డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని నగరపాలక కమీషనర్ తెలిపారు. ఈ తరుణంలో హైకోర్టులో ప్రస్తుతం 48 వార్డులకే ఎన్నికలను జరుపుతున్నారని... మొత్తం 50 వార్డులకు ఎన్నికలను నిర్వహించాలంటూ పిటిషన్ దాఖలు అయ్యింది. అయితే విచారణ అనంతరం పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు ఎన్నికలను ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.