సినిమాను బాగా ఎంజాయ్ చేశా : పవన్

SMTV Desk 2019-04-17 18:23:44  pawan kalyan, chitralahari, sai tej

హైదరాబాద్: మెగా హీరో సాయి తేజ్ హీరోగా నటించిన సినిమా ‘చిత్రలహరి’. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడిన తేజ్ ఈ సినిమాతో అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేత పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగ నటించారు. ఇక ఈ సినిమాను చూసిన పవన్ కళ్యాణ్ సినిమా విపరీతంగా నచ్చడంతో ఆ చిత్రబృందానికి పుష్పగుచ్చాలు పంపించి అభినందించారు. ‘కాంగ్రాటులేషన్స్‌, నిజంగా ఈ సినిమాను నేను బాగా ఎంజాయ్‌ చేశానంటూ’ .. గ్రీటింగ్‌ పంపించారు. పవన్‌ స్వయంగా తమ పనిని మెచ్చుకోవడంతో సినిమా యూనిట్‌ మరింత సంబరపడిపోతుంది.