రూ.2,483 కోట్ల నికర లాభాల్లో విప్రో

SMTV Desk 2019-04-17 17:19:24  wipro

న్యూఢిల్లీ: విప్రో సంస్థ 2019 క్యూ4(జనవరిమార్చి)లో రూ.2,483 కోట్ల నికర లాభంతో 37.7 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ మొత్తం ఆదాయం ఏడాదిఏడాది ఆధారంగా చూస్తే రూ.15,915 కోట్లతో 11 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ రూ.10,500 కోట్ల బైబ్యాక్ ప్లాన్‌ను ప్రకటించింది. సంస్థ ఆదాయం రూ.15,006 కోట్లతో 8.9 శాతం వృద్ధిని నమోదు చేయగా, గతేడాది ఇదే సమయంలో ఆదాయం రూ. 13,768 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి(201819) గాను విప్రో నికర లాభం రూ.9,017 కోట్లతో 12.6 శాతం వృద్ధిని సాధించగా, అలాగే ఆదాయంలో రూ.58,584 కోట్లతో 7.5 శాతం వృద్ధని సాధించింది. విప్రో సిఇఒ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబిదాలి నీముచ్‌వాలా మాట్లాడుతూ, తమ టీమ్ సంస్థ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసిందని, దీంతో ఏడాదిఏడాదికి త్రైమాసికాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని అన్నారు. ఆరోగ్యకరమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిలో పటిష్టమైన పునాది వేశామని.. డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్ సేవలు, క్లౌడ్ వంటి విభాగాల్లో పెట్టుబడులను కొనసాగిస్తామని అన్నారు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో విప్రో షేరు విలువ 2 శాతం నష్టపోయి రూ.281.60 వద్ద స్థిరపడింది.