జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఇలా చూడడం బాధాకరం : మల్ల్యా

SMTV Desk 2019-04-17 17:16:36  vijay mallya, king fisher, jet airways

లండన్‌: కింగ్ ఫిషర్ సంస్థ అధినేత విజయ్ మల్ల్యా రోజురోజుకి దిగజారిపోతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేశారు. జెట్‌ ఈ పరిస్థితికి రావడానికి కారణం కేంద్రప్రభుత్వ వివక్షే కారణమంటూ ట్విట్టర్‌ వేదికగా ఆరోపణలు చేశారు. ఒకప్పుడు కింగ్‌ఫిషర్‌ జెట్‌ ఎయిరవేస్‌కు గట్టి పోటీనిచ్చింది. అంత పెద్ద ఎయిర్‌లైన్స్‌ నేడు ఈ స్థితిలో చూడాల్సి రావడం బాధాకరం అని ఆయన అన్నారు. కాని ఎయిరిండియాను బయటపడేసేందుకు మాత్రం రూ. 35 కోట్లు వెచ్చించింది. మేం పోటీ దారులం అయినప్పటికి ఇలాంటి పరిస్థితుల్లో నరేశ్‌ గోయల్‌ దంపతులకు సానుభూతి తెలుపుతున్నా. జెట్‌ కోసం వారెంతో కష్టపడ్డారని మాల్యా అన్నారు. ఈ సందర్భంగా తాను తీసుకున్న రుణాలు 100 శాతం తిరిగి చెల్లిస్తానని చెబుతూనే ఉన్నాను. ఐనా పట్టించుకోకుండా నాపై నేరాభియోగాలు వేస్తున్నారు. తాను రుణాలు చెల్లిస్తానని చెప్పినప్పుడల్లా మీడియా భారత్‌కు అప్పగించే విషయం గురించి మాట్లాడుతుంది. తాను లండన్‌లో ఉన్నా..భారత్‌లో ఉన్నా రుణాలు చెల్లించేందుకు సిధ్దంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.