విజయాల బాటలో పంజాబ్

SMTV Desk 2019-04-17 15:42:43  ipl 2019, kxip vs rr

మొహాలి: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టు ఘన విజయం సాధించింది. రాజస్థాన్ జట్టు లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగుల మాత్రమే చేసింది. దీంతో పంజాబ్, రాజస్థాన్ జట్టుపై 12 పరుగుల తేడాతో గెలుపొందంది. ఓపెనర్ జోస్ బట్లర్ 23, రాహుల్ త్రిపాఠి 50, సంజు శాంసన్‌ 27, అజింక్య రహానే 26 రాణించారు.ఇక, చివర్లో స్టువర్ట్‌ బిన్నీ 33 పరుగులతో మెరిసినా అప్పటికే ఆలస్యమైంది. దీంతో పంజాబ్ జట్టు సునాయసంగా గెలుపొంది. కాగా, పంజాబ్ బౌలర్లలో అర్షదీప్‌, అశ్విన్‌, షమి తలో రెండు వికెట్లు తీశారు.