హీరో నాగార్జున ఆక్రమించిన భూముల కేసు సంగతి ఏమైంది: విజయశాంతి

SMTV Desk 2019-04-17 15:39:31  nagarjuna, vijayashanti, kcr, telangana revenue department

హైదరాబాద్, ఏప్రిల్ 17: రెవిన్యూ శాఖ ప్రక్షాళన పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నానాయాగీ చేస్తున్నారని కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి విమర్శించారు. రెవిన్యూ శాఖలో ఇప్పుడే అవినీతి జరిగిందా? అని ప్రశ్నించారు. తప్పు చేసినవారిని బెదిరించడం, వారు లొంగిపోతే తెరవెనుక లాలూచీ పడటం కేసీఆర్ కు మామూలేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయశాంతి మాట్లాడారు.

గతంలో నయీం వివాదం, హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసు విచారణ, మియాపూర్ భూములు, హీరో నాగార్జున ఆక్రమించిన భూముల కేసు సంగతి ఎంతవరకూ వచ్చిందని ప్రశ్నించారు. రెవిన్యూ శాఖ ప్రక్షాళన అంశం కూడా కొండను తవ్వి ఎలుకను పట్టే చందంగా మారుతుందని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.