మళ్ళీ రష్మికనే ఎంచుకున్న దర్శకుడు

SMTV Desk 2019-04-17 15:34:09  nithin, bheeshma, rashmika mandanna

హైదరాబాద్, ఏప్రిల్ 17: నితిన్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు వున్నాయి. ఈ మూడింటిలో ముందుగా ఆయన భీష్మ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నాడు. ఛలో సినిమాతో మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల, నితిన్ తో చేసేది కూడా ప్రేమకథా చిత్రమే. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నారు.

మరో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నారనే వార్త రెండు మూడు రోజులుగా షికారు చేస్తోంది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు వెంకీ కుడుముల స్పందించాడు. ఈ సినిమాలో ఒక కథానాయిక మాత్రమే ఉంటుందనీ, ఆ పాత్రకి రష్మికను తీసుకోవడం జరిగిపోయిందని అన్నాడు.

మరో కథానాయిక అవసరం లేదనీ, కల్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేసుకున్నామనే వార్తలో నిజం లేదని స్పష్టం చేశాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నామనే విషయాన్ని తెలియజేశాడు.