మాన్కడింగ్ కాంబో రిపీట్....ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

SMTV Desk 2019-04-17 15:25:49  ipl 2019, kxip vs rr, rr choose to bowl

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు మొహేలిలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో ఇప్పటికే 8 మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు నాల్గింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. ఏడు మ్యాచ్‌లాడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచిన రాజస్థాన్ ఏడో స్థానంలో ఉంది. అయితే.. చివరిగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకం బాది జట్టుని గెలిపించిన జోస్ బట్లర్‌ ఫామ్ ఇప్పుడు మంచి జోరుమీదున్నాడు. మరోవైపు పంజాబ్ జట్టు చివరిగా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఒత్తిడిలో ఉంది. ముఖ్యంగా.. కెప్టెన్ అశ్విన్‌పై ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

Rajasthan Royals (Playing XI): Ajinkya Rahane(c), Jos Buttler, Sanju Samson(w), Rahul Tripathi, Ashton Turner, Stuart Binny, Jofra Archer, Shreyas Gopal, Jaydev Unadkat, Dhawal Kulkarni, Ish Sodhi.

Kings XI Punjab (Playing XI): Lokesh Rahul, Chris Gayle, Mayank Agarwal, David Miller, Mandeep Singh, Nicholas Pooran(w), Ravichandran Ashwin(c), Murugan Ashwin, Mohammed Shami, Mujeeb Ur Rahman, Arshdeep Singh.