త్వరలో మార్కెట్లోకి బజాబ్‌ ‘క్యూట్‌’

SMTV Desk 2019-04-17 14:25:09  Bajaj Qute, bajaj

న్యూఢిల్లీ: ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ బజాబ్‌ ఆటో ఇప్పుడు కార్లను తాయారు చేసేందుకు సిద్దం అయ్యింది. ఈ క్రమంలో బజాబ్‌ ‘క్యూట్‌’ పేరుతో తొలిసారిగా కార్లను తయారు చేస్తుంది. అయితే ఏప్రిల్‌ 18న అధికారికంగా ఈ కారును భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఈరోజు ప్రకటించింది. అంతేగాక భారత్‌లోనే తొలి క్వాడ్రిసైకిల్‌ ఇదే కావడం విశేషం. అంటే డిజైన్‌, వినియోగం పరంగా ఆటో, కారుకు మధ్యస్తంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ కారును తీసుకొస్తున్నట్లు గతంలో బజాజ్‌ వెల్లడించింది. అందుకే అందుబాటు ధరల్లో విడుదల చేస్తోంది. పెట్రోల్‌ వెర్షన్‌ ధర రూ. 2.64లక్షలు, సీఎన్‌జీ వెర్షన్‌ ధర రూ. 2.84లక్షలుగా(ఎక్స్‌షోరూం) ఉంటుందని తెలిపింది.