ఐపీఎల్ 2019 సీజన్లో ఆసిస్ ప్లేయర్స్ ఔట్ !!!

SMTV Desk 2019-04-17 14:13:59  ipl 2019, david warner, steave smith, srh, rr

ఐపీఎల్ 2019 సీజన్లో కొన్ని టీంలకు త్వరలో గట్టి షాక్ తగలనుంది. ఈ సీజన్లో విండీస్ ఆటగాళ్ళు, ఆసిస్ ఆటగాళ్ళు ఎంత విజయవంతమయ్యారో తెలిసిందే. అయితే త్వరలో రానున్న వరల్డ్ కప్ కారణంగా అందులో ఎంపికైన ఆసిస్ ఆటగాళ్ళు ఏప్రిల్ నెల చివరన స్వదేశానికి వెళ్లనున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు వార్నర్‌, రాజస్థాన్‌ రాయల్స్ జట్టుకు స్మిత్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. మే 2 కంటే ముందు సన్‌రైజర్స్‌ ఆడే 5 లీగ్‌ మ్యాచ్‌లకే వార్నర్‌ అందుబాటులో ఉంటాడు. మరోవైపు స్మిత్‌ ఏప్రిల్‌ 30న బెంగళూరుతో చివరి మ్యాచ్‌ ఆడనున్నాడు. ఇక బెంగళూరు జట్టుకు ఆడుతున్న స్టొయినిస్‌, ముంబైకి ఆడుతున్న బెహ్రెన్‌డార్ఫ్‌ కూడా ఐపీఎల్‌ను వీడనున్నారు. ముంబైకి ప్రధాన పేసర్ అయిన బెహ్రెన్‌డార్ఫ్‌.. సన్‌రైజర్స్‌కు ప్రధాన బ్యాట్స్‌మన్‌ అయిన వార్నర్‌ అందుబాటులో లేకపోవడం ఆ జట్లకు పెద్ద ఎదురుదెబ్బే. అయితే స్మిత్‌, స్టొయినిస్‌లు ఇంతవరకు అంతగా ఆకట్టుకోలేదు.