పక్కా హిట్టు కొడుతున్నాం

SMTV Desk 2019-04-16 18:04:35  Natural Star Nani,

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. క్రికెట్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా ఫలితంపై నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సోమవారం జరిగిన జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నాని జెర్సీ తన కెరియర్ లో బెస్ట్ సినిమా అని చెప్పాడు.

ఇక సినిమాతో పక్కా హిట్టు కొడుతున్నాం.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్.. ఇలాంటివేమి కాదు కాని ఇదిపక్కా మంచి సినిమా అని అన్నారు నాని. ఇక ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన వెంకటేష్ కు తన కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన బాబు బంగారం సినిమాకు తాను వెళ్లానని.. ఆయన జెర్సీ ఈవెంట్ కు రావడం విశేషమని. ఇద్దరం కలిసి నటించాలని ఉందని అన్నాడు నాని. ఇక సినిమా దర్శకుడు గౌతం ఇంకా సినిమా బిజీలో ఉండటం వల్ల చెన్నైలో ఉన్నాడని ఇప్పుడు తను మాట్లాడకపోయినా ఏప్రిల్ 19 తన సినిమా మాట్లాడుతుందని అన్నాడు నాని. నాని జోష్ చూస్తుంటే జెర్సీ సూపర్ హిట్ కొట్టేలానే ఉంది. ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే నాని ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమాగా జెర్సీ నిలిచేలా ఉంది.