లక్కీ ఛాన్స్ కొట్టేసిన కళ్యాణి ప్రియదర్శన్

SMTV Desk 2019-04-16 18:01:00  kalyani Priyadarshan hot

నితిన్ హీరోగా ఛలో ఫేం వెంకీ కుడుముల డైరక్షన్ లో వస్తున్న సినిమా భీష్మ. రీసెంట్ గా ఈ సినిమా పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. మూవీలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది. అయితే సినిమాలో సెకండ్ హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. ఆ లక్కీ ఛాన్స్ హలో ఫేం కళ్యాణి ప్రియదర్శన్ అందుకుందని తెలుస్తుంది. మళయాళ దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ కూతురైన కళ్యాణి ప్రియదర్శన్ హలో చేసినా పెద్దగా మెప్పించలేదు.

లేటెస్ట్ గా వచ్చిన చిత్రలహరితో హిట్ అందుకుంది ఈ అమ్మడు. సాయి తేజ్ హీరోగా వచ్చిన చిత్రలహరి సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ లుక్స్ కు అందరు ఫిదా అయ్యారు. నితిన్ సినిమాలో అమ్మడు సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అయితే సెకండ్ హీరోయిన్ అనగానే అదేదో సైడ్ పాత్ర అనుకుంటే పొరపాటే సినిమాలో కళ్యాణి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు. ఓ పక్క క్రేజీ రష్మిక మరో పక్క క్యూట్ కళ్యాణి ఈ ఇద్దరితో నితిన్ చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి.