ఇస్లామిక్ స్టేట్ ప్రధాన తీవ్రవాదులు హతం

SMTV Desk 2019-04-16 17:21:33  islamic terrorist, america airforce

న్యూయార్క్: అమెరికా వాయు సైన్యం తాజాగా సోమాలియాలో జరిపిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థకు సంబంధించిన ఇద్దరు అగ్ర ప్రధాననేతలు హతమయ్యారు. బరి ప్రాంతంలో ఇస్లామిక్ ఉగ్రవాదంలో రెండు ర్యాంక్ లో ఉన్న అబ్దుల్ హకిమ్ ధాఖుబ్ మృతదేహాన్ని గుర్తించామని స్థానిక సోమాలియా పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. దాడులకు సంబంధించిన వ్యూహాలు రచించడంలో అబ్దుల్ దిట్ట స్థానిక పోలీసులు పేర్కొన్నారు. సోమాలియాలో ఆల్ ఖైదా ఉగ్రవాదులతో పోలిస్తే ఆల్ షాబాబ్ తీవ్రవాదులు ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రస్తుతం సోమాలియాలో 75 నుంచి 250 వరకు ఇస్లామిక్ తీవ్రవాదులుండగా, 3000 నుంచి 7000 వరకు అల్ షాబాబ్ తీవ్రవాదులు ఉండొచ్చని అమెరికా నిఘా సంస్థ అంచనా వేస్తోంది. ప్రపంచంలో మాత్రం హరాకత్ అల్ షాబాబ్ అల్ ముజాహిదీన్ సభ్యులు 7000 నుంచి 9000 వరకు ఉండొచ్చని 2014లో అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం వెల్లడించింది.