‘జెర్సీ’ చిత్రానికి క్లీన్‌ ‘u’

SMTV Desk 2019-04-16 17:15:13  Jersey, nani,

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రానికి క్లీన్‌ ‘u’ సర్టిఫికేట్‌ లభించింది. ఈ విషయాన్ని నాని సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ ‘ఆర్‌ ‘U’ రెడీ?’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఓ చిన్న పిల్లాడితో సరదాగా ఆడుకుంటున్న కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. గౌతమ్‌ తిన్ననూరి సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోమవారం సినిమా ప్రీరిలీజ్‌ వేడుక అట్టహాసంగా జరిగింది. వేడుకకు సినీ నటుడు విక్టరీ వెంకటేశ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఆయనతో కలిసి చిత్రబృందం సరదాగా క్రికెట్‌ కూడా ఆడింది. ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటించారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.