నోకియా ప్రియులకు శుభవార్త

SMTV Desk 2017-08-17 16:04:30  Nokia 8, smart phone, mobile, Finnish company HMD Global

ముంబై, ఆగస్ట్ 17: నోకియా స్మార్ట్‌ఫోన్ అభిమానులకు శుభవార్త, ఆశక్తికరంగా ఎదురుచూస్తున్న నోకియా 8 మార్కెట్‌లోకి వచ్చేసింది. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 8ను విడుదల చేసింది. కాగా, మరికొన్ని రోజులలో మార్కెట్లోకి రానున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, ఐఫోన్ 8 మోడల్స్ కు గట్టి పోటీగా నోకియా 8 నిలుస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 5.3 అంగుళాల డిస్ ప్లే, నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్, 3090 ఎంఏహెచ్ బ్యాటరీలతో పాటు ముందు, వెనుక 13 ఎంపీ కెమెరాలు కలిగి వస్తుంది. అయితే దీని ధర సుమారు రూ. 45 వేల వరకూ ఉంటుంది. కాగా, అక్టోబర్‌ నెల నుంచి ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లభించనున్నట్లు టెలికం వర్గాలు అంచనా వేస్తున్నాయి.