మార్కెట్లోకి రానున్న వేగ బ్లూటూత్ హేల్మేట్స్

SMTV Desk 2019-04-16 16:59:23  vega, vega Bluetooth helmet

ప్రముఖ సంస్థ వేగ ఇప్పుడు మరో నూతన హేల్మేట్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కంపెనీ తాజాగా ఇవో బీటీ పేరుతో బ్లూటూత్ తో పనిచేసేందుకు వీలుగా డిజైన్ చేశారు. దీని ధర రూ.2,996. దీంట్లో ఉన్న బ్లూటూత్ సాయంతో కాల్స్ మాట్లాడుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, అలాగే ఇందులో వాయిస్ అసిస్టెడ్ నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది. ఆటోమేటిక్ కాల్ అన్సరింగ్ ఫీచర్ వల్ల ఫోన్ బటన్ కూడా నొక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా కాల్స్ మాట్లాడొచ్చు. స్టీల్‌బర్డ్ ఎస్‌బీఏ 1 హెచ్ఎఫ్ అనే హెల్మెట్‌కు ఇదివరకు హ్యాండ్స్‌ఫ్రీ హెల్మెట్ అని పిలిచేవారు. అయితే టెక్నికల్‌గా ఇందులో బ్లూటూత్ టెక్నాలజీ కాకుండా ఏయూఎక్స్ వైర్ ఆధారిత కనెక్టివిటీ సదుపాయం ఉండేది. ఇక వేగ హెల్మెట్ విషయానికి వస్తే.. ఇది ఐఎస్ఐ సర్టిఫైడ్. మీడియా, లార్జ్ సైజ్‌లలో అందుబాటులో ఉంది. హెల్మెట్‌లో బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎంత చార్జింగ్ మిగిలి ఉందో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై చూడొచ్చు. ఈ హెల్మెట్ కేవలం నలుపు రంగులో మాత్రమే అందుబాటులో ఉంది.

హెల్మెట్ ప్రత్యేకతలు: మ్యూజిక్ వినొచ్చు ,కాల్స్ మాట్లాడుకోవచ్చు ,హ్యాండ్స్‌ఫ్రీ ఫంక్షన్ ,బిల్ట్‌ఇన్ రీచార్జబుల్ లి-అయాన్ బ్యాటరీ ,సీఎస్ఆర్ బ్లూటూత్ చిప్ ,స్మార్ట్‌ఫోన్లపై పవర్ డిస్‌ప్లే ,హైడెఫినేషన్ స్పీకర్లు.