కర్ణాటకలో మళ్లీ ఐటీ దాడులు

SMTV Desk 2019-04-16 16:47:27  Karnataka, IT Raids,

బెంగుళూరు : కర్ణాటకలో మళ్లీ ఐటీ మొదలయిన దాడుల కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కన్నడ నాట మాండ్య, హసన్‌లలో ఐటీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇప్పుడు మళ్ళీ ఆదాయపు పన్నుశాఖ అధికారులు కన్నడనాట సోదాలు చేపట్టారు. తెల్లవారుజామునే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు, పలువురి ఇళ్లను సోదా చేశారు. ఈ రెండు చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి. మాండ్య, హాసన్‌ లోక్ సభ నియోజకవర్గాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు యత్నిస్తున్నారని చెబుతూ ఐటీ దాడులకు దిగింది.

అయితే పార్లేమేంట్ విపక్ష అభ్యర్థులు, అనుచరుల ఇళ్లే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతుండడం కాస్త కీలకంగానే మారింది. మంత్రి పుట్టరాజు ఇళ్లు, ఆఫీసులను తనిఖీ చేశారు. సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణకు సంబంధించిన మంత్రిత్వ శాఖ లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. అటు తమిళనాడులో అన్నాడీఎంకే నేతల ఇళ్లల్లోనూ ఐటీ అధికారుల దాడులు నిన్న అర్థరాత్రి వరకు కొనసాగాయి. చెన్నైలోని మంత్రులు ఉదయ్ కుమార్, రాధాకృష్ణన్ ఇళ్లల్లో తనిఖీలు చేశారు. బెంగళూరు, చెన్నై నగరాలతోపాటు తమిళనాడు, కర్ణాటకలోని పలు చోట్ల మంగళవారం కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.