RCBపై ఫీల్డింగ్ ఎంచుకున్న ముంభై

SMTV Desk 2019-04-16 15:58:55  MI VS RCB, IPL 2019

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు ముంభైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తాజా సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన ముంబయి జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఆరు మ్యాచ్‌ల తర్వాత ఎట్టకేలకి టోర్నీలో బోణి కొట్టిన బెంగళూరు చివరి స్థానంలోనే ఉంది. ముంబయి సొంత మైదానం వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగుతుండగా.. సీజన్‌లో ఇప్పటికే ఒకసారి ఈ రెండు జట్లూ ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో మలింగ నోబాల్ వివాదం నడుమ ఆఖరి బంతికి ముంబయి గెలిచిన విషయం తెలిసిందే.

Royal Challengers Bangalore (Playing XI): Parthiv Patel(w), Virat Kohli(c), AB de Villiers, Marcus Stoinis, Moeen Ali, Akshdeep Nath, Pawan Negi, Umesh Yadav, Yuzvendra Chahal, Navdeep Saini, Mohammed Siraj.

Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Kieron Pollard, Hardik Pandya, Ishan Kishan, Krunal Pandya, Rahul Chahar, Jason Behrendorff, Lasith Malinga, Jasprit Bumrah.