నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించిన గృహిణి

SMTV Desk 2019-04-16 15:56:03  house wife qualify in four government posts, telangana, nekkonda

నెక్కొండ: తెలంగాణ రాష్ట్రంలోని నెక్కొండ మండలంలోని సూరిపల్లి గ్రామానికి చెందిన కవిత మహేందర్‌రెడ్డి అనే మహిళా నలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హురాలిగా ఘనత సాధించింది. ప్రభుత్వం విడుదల చేసిన వరుస నోటిఫికేషన్లు అయిన టిఎస్‌పిఎస్‌సి, పిజిటి, టిజిటి, తో పాటు పంచాయితి రాజ్ శాఖ జారీ చేసిన పంచాయితి కార్యదర్శి పోస్టులకు ధరఖాస్తులు సమర్పించి అన్ని శాఖల పరీక్షల్లో నూ అర్హత సాధించారు. ఎంపికైన నాలుగు పోస్టుల్లో గురుకుల పిజిటి ఉద్యొగం వైపు ఎక్కువ మక్కువ చూపి పై అధికారుల నుండి అనుమతి పత్రాన్ని పొందింది. సూరిపల్లి గ్రామంలో సాదరణ గృహిణిగా ఉంటూ నాలుగు ఉద్యోగాలకు ఎంపికవ్వడంతో ఇటు గ్రామ, మరియు మండల ప్రజలు కవితను అభినందించారు. భర్త మహేందర్ రెడ్డి మండల కేంద్రంలోని వికాస్ కళాశాల డైరెక్టర్ గా వ్యవహరించడంతో కవితకు కళాశాల అద్యాపక బృందం హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.