కల్లో దేవుడు చెప్పాడనీ భార్యాపిల్లలను కడతేర్చిన భర్త

SMTV Desk 2019-04-16 15:51:24  a man kills his wife and childrens while god says in dreams , america

వాషింగ్టన్: అమెరికాలో ఓ వ్యక్తి కల్లోకి తను ఆరాధించే దేవుడు ప్రత్యక్షమై భార్య, పిల్లలను చంపేయమని చెప్పాడని మరుసటి రోజు భార్యాపిల్లలను చంపేశాడు. పూర్తి వివరాల ప్రకారం...అమెరికాలోని ఆరిజోనాకు చెందిన ఆస్టిన్ స్మిత్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలతో హాయిగా జీవిస్తున్నాడు.. అతనికి దేవుడిపై భక్తి ఎక్కువ. నిత్యం పూజలు చేస్తుంటాడు. దీనికితోడు చాదస్తం కాస్త ఎక్కువ. ఒక రోజు ఆయనకు దేవుడు కలలో కనిపించి.. "నీ భార్య మంచిది కాదు.. పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమెను చంపేయాలని" చెప్పాడట. అంతే.. మరుసటి రోజు ఉదయం తీవ్ర ఉద్వేగానికిలోనై తన భార్యని ఎందుకలా చేశావ్ అని గట్టిగా రోదిస్తూ షూట్ చేసి చంపేశాడు. అంతటితో ఆగకుండా పిల్లల్ని చంపేశాడు. ప్రియుడి గురించి వెతుకుతూ రోడెక్కాడు. దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.